NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పరిశుభ్రమైన సమాజం  ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం

1 min read

వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించాలి

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్ నేడు:   పరిశుభ్రమైన సమాజం – ఆరోగ్యవంతమైన సమాజానికి దారితీస్తుందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ పంచాయతీలో   “వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత” అనే థీమ్ తో నిర్వహించిన ర్యాలీ లో కలెక్టర్ పాల్గొని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల 3 వ శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.. అందులో భాగంగానే ఈరోజు వ్యక్తిగత మరియు సమాజ పరిశుభద్రత అనే థీమ్ తో కార్యక్రమాలు చేసుకుంటున్నామన్నారు…  ప్రతి రోజు  2 సార్లు స్నానం చేయాలన్నారు.. వారానికి ఒకసారి గోర్లను  కట్ చేసుకోవాలన్నారు.. తినే ముందు, తిన్న తర్వాత  ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నారు..  అమ్మాయి 18 ఏళ్లు వయసు వచ్చిన తర్వాతే పెళ్లి చేయాలన్నారు..  అమ్మాయిలని, అబ్బాయిల్ని చదివించాలని వాళ్ళకు యుక్త వయస్సు వచ్చిన తర్వాతే పెళ్లి చేయాలన్నారు..  పిల్లల ఆరోగ్యం చాలా చాలా ముఖ్యమని, వారు మంచి ఆహారం తీసుకోవాలనే ఉద్దేశ్యంతో  ప్రభుత్వం తరఫునుంచి మిడ్ డే మీల్స్ కూడా ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డిపిఓ భాస్కర్, ఎంపిడిఓ నాగ అనసూయ , తహసిల్దార్ విద్యా సాగర్, డీ ఎల్ డి ఓ రమణ రెడ్డి, సర్పంచ్ బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

About Author