NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రామంలో స్వమిత్వ గ్రామ సభ

1 min read

హొళగుంద న్యూస్ నేడు:  అదోని డివిజినల్ అభివృద్ధి అధికారి నాగర్కన్వి గ్రామాన్ని (హొళగుంద మండలం) సందర్శించి గ్రామంలో స్వామిత్వ గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కొలతలు పూర్తయ్యాయి,  మరియు 9(2) నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.ఇళ్ల స్థలాల కొలతలపై ఏవైనా సందేహాలు ఉన్నపక్షంలో ఒక వారంలోపుగా సంబంధిత డిప్యూటీ ఎంపీడీవో కి లేదా డిప్యూటీ.తహసీల్దార్ కి అప్పీలు చేసుకోవచ్చని, వారు పరిశీలించి తక్షణమే సరైన చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు.తదుపరి ఆయన అన్ని పంచాయతీ అభివృద్ధి అధికారులు (PDOs), డిప్యూటీ ఎంపీడీవో మరియు ఎంపీడీవో లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన క్రింది అంశాలపై సమగ్రంగా సమీక్షించి స్పష్టమైన సూచనలు జారీ చేశారు: హౌస్ ట్యాక్స్ వసూళ్లునాన్-ట్యాక్స్ వసూళ్లుమంచినీటి సరఫరా సమస్యలుశానిటేషన్ కార్యక్రమాలు, డోర్ టు డోర్   చెత్త   సేకరణ పర్యవేక్షణ, ఎస్ డబ్లు  పి సి షెడ్ల నిర్వహణ, OHRS ట్యాంకుల శుభ్రపరిచడంకాలువలు, డ్రైనేజ్ శుభ్రతఅన్ని    పంచాయతీ అభివృద్ధి అధికారులు ఉదయం 7 గంటలకు గ్రామాలకు వెళ్లి, డోర్ టు డోర్ ట్యాక్స్ వసూళ్లను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.అలాగే అన్ని రకాల పన్నులు స్వర్ణ గ్రామపంచాయతీ పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో వసూలు చేయాలని, ఎవరూ ఆఫ్‌లైన్ వసూళ్లు చేయరాదని కఠిన ఆదేశాలు జారీ చేశారు.ప్రజలకు అవసరమైన సేవలు అందుబాటులో ఉండేందుకు అందరూ గ్రామపంచాయతీ      కార్యదర్శులు కార్యాలయంలో అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు.  ఈ సమావేశం లో    ఎంపీడీఓ  ,  డిప్యూటీ ఎంపీడీఓ,  పంచాయతీ అభివృద్ధి అధికారులు   పాల్గొన్నారు.

About Author