ఐశ్వర్యరాయ్ ఆన్ సెట్స్..
1 min readసినిమా డెస్క్ : మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కల్కి కృష్ణమూర్తి రాసిన ఐదు భాగాల చారిత్రక నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, ప్రకాశ్ రాజ్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇందులో ఐశ్వర్య రాయ్ డబుల్ రోల్ చేస్తున్నారని టాక్. తాజాగా ఈ సినిమా రెండు పార్ట్‌లుగా ఉంటుందని, మొదటి ప్టార్ట్ వచ్చేయేడు రిలీజ్ అవుతుందని ప్రకటిస్తూ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. రీసెంట్‌గా పాండిచ్చేరిలో తిరిగి షూటింగ్ స్టార్ట్ చేశారు. కార్తి, ఐశ్వర్యలక్ష్మీ లాంటి వాళ్లంతా ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటుండగా, తాజాగా ఐశ్వర్యరాయ్ కూడా సెట్‌లో జాయిన్ అయింది. నందిని, మందాకిని దేవి అనే రెండు పాత్రల్లో తను కనిపించనుంది. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మణిరత్నం నిర్మిస్తున్నారు. రెహమాన్ సంగీతం, రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.