బాలికల పాఠశాల హెచ్ఎం కృష్ణమూర్తిని సస్పెండ్ చేయాలి
1 min read

ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు అవినీతికి పాల్పడ్డాడని విచారణలో తెలిసినా కూడా చర్యలు తీసుకోవడంలో ఆర్జెడి డీఈఓ ల వైఫల్యం స్వయంగా ఆర్జెడి డీఈవో సమక్షంలో ఎమ్మిగనూరు బాలికల పాఠశాల హెచ్ఎం. కృష్ణమూర్తి అవినీతిపై విచారణవారాలు గడుస్తున్న కూడా చర్యలు తీసుకోవడం లేదని ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు శేఖర్ ఉదయ్ కృష్ణ రఘునాథ్ మాట్లాడుతూ కొన్ని వారాల క్రితం బాలికల పాఠశాల హెచ్ఎం కృష్ణమూర్తి విద్యార్థుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని స్వయంగా ఆర్జెడి డీఈవోలు వచ్చి విచారణ చేయడం జరిగింది ఆ విచారణలో భాగంగా అధికారుల విద్యార్థులను వివరణ వారు మేము డబ్బులు ఇచ్చామననే కోణంలో అధికారులకు చెప్పారు అని విచారణలో అవినీతికి పాల్పడినట్లు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూఉన్న కూడా పై అధికారులు మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ఆయనకు అవినీతి హెచ్ఎం కు వత్తాసు పలకడం తగదని అదేవిధంగా పేద విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు కట్టుకోలేక ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్య గవర్నమెంట్ పాఠశాలలకు వెళ్తే గవర్నమెంట్ పాఠశాలల్లో కూడా డబ్బులు వసూలు చేయడం దారుణమని విద్యార్థి సంఘాలుగా మేము దీనిని ఖండిస్తూ నామని అదేవిధంగా ప్రభుత్వం విద్యార్థుల కోసం విద్యార్థుల భవిష్యత్ కోసం కొన్ని కోట్లల్లో ఖర్చులు పెడుతూ ఉన్న మరల పాఠశాల హెచ్ఎం కృష్ణమూర్తి అవి సరిపోనట్టుగా విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలో తొక్కడం జరుగుతుంది అని వారు అన్నారు ఇకనైనా పై విద్యాధికారులు దీనికి స్పందించి మీరు ఆయనను సస్పెండ్ చేసి పేద విద్యార్థుల జీవితాలు కాపాడాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో మరిన్ని ఉద్యమాలకు పూనుకుంటామని వారు హెచ్చరించారు.

