NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేజీబీవీ ప్రిన్సిపాల్ కు వత్తాసు పలుకుతున్న డీఈవో ను,  జి సి డి వో ను సస్పెండ్ చేయాలి

1 min read

పెద్దకడుబూరు కేజీబీవీ  ప్రిన్సిపాల్ రుక్సానను  కొనసాగించాలి

ఎమ్మిగనూరు న్యూస్ నేడు:  అవినీతి ఆరోపణ లు ఎదుర్కొంటూన్న  ప్రిన్సిపాల్ ను సస్పెండ్  చేయకుండా పక్షపాత ధోరణి లో బదిలీ వెనుక అంతర్యం ఏమిటి???పెద్దకడబూరు కస్తూర్బా గాంధీ పాఠశాలకు  ఇటీవల మద్దికేర కేజీబీవీ పాఠశాల నుండి  బదిలీ పై వచ్చినటువంటి  ప్రిన్సిపల్ జ్యోతి కి వత్తాసు  పలుకుతూ పెద్దకడబూరు కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్ గా నియమించినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ, జిసిడిఓ లను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెదకడుబూరు లో  ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ పాఠశాల ముందు విద్యార్థి సంఘాలుగా ధర్నా నిర్వహించడం జరిగింది ,ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు శేఖర్ నాయుడు ,ఉదయ్, రఘు ,కాజా, కృష్ణ మాట్లాడుతూ గతంలో మద్దికేర కేజీబీవీ ప్రిన్సిపల్ గా జ్యోతి గారు విధులు నిర్వహిస్తూ అక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించక విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపల్ జ్యోతి ని సస్పెండ్ చేయకుండా  జిల్లా విద్యాశాఖ అధికారులు డిఇఓ, జిసిడిఓ  కాలయాపన చేస్తూ తిరిగి మరల పెద్దకడుబూరు కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్ గా అవినీతి చేసిన ప్రిన్సిపల్ జ్యోతి ని అక్కడ నియమించి, పెద్దకడుబూరు  కేజీబీవీ పాఠశాల లో విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపల్ రుక్సానను మద్దికేర కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్ గా మధ్యంతర ట్రాన్స్ఫర్లు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో జిల్లా విద్యాశాఖ అధికారులు  డీఈవో. జి సి డి ఓ. లు తక్షణమే వివరణ ఇవ్వాలని, మరియు అనేకసార్లు విద్యార్థి సంఘాలుగా  అవినీతి ప్రిన్సిపాల్ ల పై ఫిర్యాదులు చేసిన కాలయాపన చేస్తూ అవినీతి చేసిన ప్రిన్సిపాల్ లకు వత్తాసు పలుకుతూ కేవలం ఎంక్వయిరీల కె పరిమితమవుతూ కలయాపన చేస్తున్న డీఈఓ , జి సి డి ఓ ,ను సస్పెండ్ చేయాలని మరియు పెద్ద కడుబూరు కేజీబీవీ పాఠశాలలో గతంలో విధులు నిర్వహిస్తున్నా ప్రిన్సిపల్ రుక్సాన ని కొనసాగించి  విద్యార్థుల చదువులను కాపాడాలని వారు డిమాండ్ చేశారు, లేనిపక్షంలో విద్యార్థి సంఘాలుగా డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు డిమాండ్ చేశారు ,ఈ కార్యక్రమంలో రమేష్, ఆనంద్ ,అశోక్, కిట్టు తదితరులు పాల్గొన్నారు.

About Author