అల్లూరు’లో పచ్చదనం-పరిశుభ్రత..
1 min read

పరిసరాలు శుభ్రత ముఖ్యం: మాండ్ర
నందికొట్కూరు, న్యూస్ నేడు: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమని హలో శుభ్రంగా ఉంచుకోవడం వల్ల రోగాలు దరి చేరవని మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని అల్లూరు గ్రామంలో శుక్రవారం ఉదయం “పచ్చదనం-పరిశుభ్రత”అనే ప్రభుత్వ కార్యక్రమంలో అధికారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామం పురవీధుల్లో చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు.ఈ కార్యక్రమంలో సున్నంపల్లి శ్రీనివాసులు,పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలు,పాలబాబు ఇతర గ్రామాల పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

