NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారతీయ ఇతిహాసాలన్నీ సామాజిక స్పృహను పెంచేవే

1 min read

డాక్టర్ మల్లు వేంకరెడ్డి, తితిదే.

గోపూజతో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు

కర్నూలు, న్యూస్​ నేడు:  విద్యఅంటే కేవలం చదువే కాదని,  ఏది తెలుసుకుంటే ఇహపరాలకు సుఖ శాంతులను కలిగిస్తుందో అదే నిజమైన విద్యఅని, భారతీయ ఇతిహాసాలన్నీ ఐహిక సుఖంతోపాటు సామాజిక స్పృహను పెంచేవేనని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కళ్ళు నిర్ల శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో వెలుగోడు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మూడు రోజులపాటు శ్రీనివాస రామానుజ దాసు, నిత్యతృప్తదాస్ చేసిన భాగవత పురాణం భక్తులను ఎంతగానో అలరించినది. ఈ కార్యక్రమంలో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులు లాలం సుధాకర్, ఉపిద్యక్షులు ఎల్. జనార్దన్, గౌరవాధ్యక్షులు జూటూరు నాగపుల్లయ్య, సభ్యులు సంజీవరాయుడు, శ్రీనివాసులు, ధర్మప్రచారమండలి సభ్యులు ఉదారు రామలింగేశ్వర రెడ్డి, అర్చకులు తిరుపాలయ్య, మహిళామండలి సభ్యులు లాలం మాధవి, తల్లం అనురాధ తదితరులు పాల్గొన్నారు.

About Author