NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలి…

1 min read

6,వ రోజు నిరాహార దీక్ష సందర్భంగా మంత్రికి లోకేష్ కు పోస్ట్ కార్డు ద్వారా విజ్ఞప్తి:ఏఐటీయూసీ, ఐఎఫ్టియు

ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణంలో వైసిపి,టిడిపి అధికారంలో ఉన్న సందర్భంలో ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో పని చేస్తూ అనారోగ్యాలతో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడంలో వైసిపి, టిడిపి పార్టీలు మోసం చేశాయని సిపిఐ పట్టణ కార్యదర్శి జి రంగన్న, సిపిఐ (ఎంఎల్ న్యూ డెమోక్రసీ) జిల్లా నాయకులు రాజు తెలిపారు. శనివారం రోజున కార్మిక కుటుంబ సభ్యుల నిరాహార దీక్షలు 6,వ రోజుకు చేరుకున్న సందర్భంగా మున్సిపాలిటీలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటి మంత్రి నారా లోకేష్ కు పోస్ట్ కార్డు ద్వారా విన్నపం చేయడం జరిగిందని ఏఐటియుసి తాలూకా కార్యదర్శి తిమ్మగురుడు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో ఏండ్లు తరబడి పని చేస్తూ,కరోనా మహమ్మారి లాంటి విపత్తులో సైతం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన కార్మికులు దురదృష్టవశాత్తు 13 మంది కార్మికులు మరణించడం జరిగిందని, అలా మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఆ మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించే అధికారం జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ ఉన్న ఐదేళ్ల కాలంలో అంటే వైసిపి ప్రభుత్వ హయాంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ఉండగా ప్రస్తుత టిడిపి ప్రభుత్వంలో కూడా ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ఉన్నారని ఈ ఐదేళ్లు కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించడంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి సంవత్సరాల కొద్ది కాలాన్ని వృధా చేసి కార్మిక కుటుంబ సభ్యులను రోడ్డుపాలు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జయ నాగేశ్వర్ రెడ్డి వ్యవహారం ఎట్లుంది అంటే ఏరు దాటే ముందు ఓడు మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడి మల్లన చందంగా ఉందని వారు తెలిపారు. కార్మికుల ఓట్లు ద్వారా గద్దెకెక్కిన శాసనసభ్యులు బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి  స్పందించి చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని వారు తెలిపారు.కాబట్టి చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులు సర్వం కోల్పోయారని కాబట్టి వారు కుటుంబ సభ్యులకు తక్షణమే ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చే విధంగా చూడాలని లేనిపక్షంలో ఈ పోరాటం మరింత ఉద్దీక్తంగా చేస్తామని వారిచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి విజేంద్ర మున్సిపల్ కార్మిక నాయకులు ఎల్లప్ప,శివ, భీమన్న గౌడ్, రాజు, విక్రం, కిరణ్, ప్రతాప్,సల్మాన్, ఫకీర్ సాబ్, ఆరిఫ్, దేవదాస్, తదితరులు పాల్గొన్నారు.

About Author