NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బిషప్ జయరావు పై  అవినీతి ఆరోపణలు తగవు 

1 min read

దళిత న్యాయవాదులు ఖండించారు

తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తామని పలువురి హెచ్చరక

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: తూర్పు గోదావరి జిల్లా గౌరీపట్నంలోని ప్రేమ సేవ ఛారిటబుల్ ట్రస్ట్ లో ఎలాంటి అవినీతి జరగలేదని పలువురు క్రైస్తవ సంఘం నాయకులు, దళిత న్యాయవాదులు ఖండించారు.నిధులు దుర్వినియోగం కాలేదని, ఏలూరు డయాసిస్ బిషప్ మోస్ట్ రెవరెండ్ పొలిమేర జయ రావు పై అసత్య ఆరోపణలు ఖండిస్తున్నామని, తప్పుడు కేసులను తీవ్రంగా పరిగణిస్తున్నామని  నేషనల్ దళిత జేఏసీ ప్రముఖ న్యాయవాది చైర్మన్ పెరికె వరప్రసాదరావు హెచ్చరించారు. గుంటూరు జిల్లాకు చెందిన పోర్టు మెరక లక్ష్మీ దుర్గ గౌరీపట్నంలోని ప్రేమ సేవా చారిటబుల్ ట్రస్ట్ కు కేవలం 10వేల రూపాయలు విరాళమిచ్చి  బిషప్ తండ్రి  మీద కేసులు పెట్టడం, మా గురువర్యులు,ఫాదర్ లు రాజు,మోజెస్,ధారా రవి, ఫాదర్ జాన్ పీటర్, నాగేశ్వరరావు పై అక్రమ కేసులను పెట్టిన మెరక లక్ష్మీ దుర్గ పై పరునష్ట దావా వేస్తామని ధైర్యం ఉంటే బహిరంగంగా బయటికి రావాలని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే సై బర్ క్రైమ్ కేసులు పెడతామని హెచ్చరించారు.బిషప్ తండ్రి  జయ రావుపై, ఫాదర్లపై కేసులు పెట్టడం హేయమైన చర్యగా భావించారు. కొంత మంది  తన సొంత లాభాపేక్ష కోసమే,వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు కోసమే బిషప్  పై, ఆర్సీఎం డయాసిస్ పై దుష్ప్రచారం  చేస్తున్నారని పలు ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఫాదర్ జాన్ పీటర్  గౌరీపట్నంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరీపట్నం మేరీమాత ఉత్సవాలు జరుపుతారని, దానికి వచ్చిన కానుకలు సేవా కార్యక్రమాలకు, సంస్థలకు ఖర్చు పెడతారని,ఆ విధంగా ఖర్చు పెట్టడం కూడా అక్రమంగా ఖర్చు పెడుతున్నారని అనటంలో అర్థం ఏమిటని? వారు ప్రశ్నించారు.క్రిస్టియన్ మైనార్టీ సంస్థలపై, ఆస్తులపై అసత్య ఆరోపణలు మానుకోవాలని ఏలూరులో న్యాయవాదులు దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టారు. విలేకరుల సమావేశంలో న్యాయవాది పెరికె వరప్రసాదరావుతో పాటు   కలపాల రవి సీనియర్, న్యాయవాది మాజీ ఏజీపీ మద్దాల వాసు, న్యాయవాది మద్దాల గోపాల్, ఏలూరు బార్ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీ సీనియర్ న్యాయవాది నోముల రాముడు,  విజయ్ కుమార్, సాగర్ బాబు తదితర న్యాయవాదులు పాల్గొని బిషప్ కి మద్దతు తెలియజేశారు.

About Author