NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాగటూరు ఎత్తిపోతల పథకానికి ఎంపీ నిధులు

1 min read

రైతులకు తెదేపా పెద్దపీట

అర్జీలు స్వీకరించిన ఎంపీ బైరెడ్డి శబరి..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: నందికొట్కూరు మండల పరిధిలోని నాగటూరు ఎత్తిపోతల పథకం మరమ్మతు పనులకు గాను నా సొంత నిధుల నుండి నిధులు మంజూరు చేసినట్లు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం వారి స్వగృహంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన పాత్రికేయుల ఎంపీ మాట్లాడుతూ మొదటి నుంచి రైతులకు తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తుందని కూటమి ప్రభుత్వం రైతుల వెంటే ఉంటుందని రైతుల సమస్యలను తీరుస్తుందని అన్నారు.గత ఐదేళ్లలో రైతులను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అంతేకాకుండా నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర ట్రాన్స్ ఫార్మర్లు దొంగలిస్తే వాటి మరమ్మతుల పనుల కోసం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి నా సొంత ఎంపీ నిధులు 18 లక్షలను మంజూరు చేసినట్లు ఎంపీ తెలిపారు.తర్వాత వచ్చిన ప్రజల నుండి ఎంపీ అర్జీలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి,కౌన్సిలర్ చాంద్ బాషా,లాలు, బంగారు వెంకటేశ్వర్లు, దామోదర్ రెడ్డి,సర్పంచ్ జీవరత్నం,సత్యం రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు.

About Author