పరికరాల కొరకు దివ్యాంగులకు పరిశీలన..
1 min read

ఐఈఆర్టి డీసీఓ జగన్ మోహన్ రెడ్డి..
నందికొట్కూరు, న్యూస్ నేడు: కృత్రిమ పరికరాల కొరకు 105 మంది దివ్యాంగ చిన్నారులుహాజరైనట్లు ఐఈఆర్టి జిల్లా కో ఆర్డినేటర్ ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో సీఎస్ఐ చర్చి ప్రాంగణంలో మంగళవారం సమగ్ర శిక్ష ఆలింకో ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత పరికరాల కొరకు నిర్ధారణ శిబిరం నిర్వహించారు.ఈ శిబిరానికిజిల్లా కోఆర్డినేటర్,అసిస్టెంట్ డి సీఓ శ్రీనివాసులు,ఏఎల్ఎస్ కో ఆర్డినేటర్ ప్రసన్నకుమార్ హాజరయ్యారు. నందికొట్కూరు, జూపాడుబంగ్లా,మిడుతూరు, పగిడ్యాల,గడివేముల మండలాలకు చెందిన దివ్యాంగులు శిబిరానికి హాజరైనట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ మాట్లాడుతూ చిన్నారులకు ఏమేమి పరికరాలు కావాలో డాక్టర్లు దృవీకరించిన తర్వాత వాటిని అప్లోడ్ చేస్తామని పరికరాలు వచ్చిన తర్వాత పరికరాలు వచ్చిన వారికి ఫోన్ ద్వారా కానీ మా సిబ్బంది సమాచారం ఇస్తారని అప్పుడు పరికరాలను పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రియవర్మ,తివారి, ఆడియాలజిస్ట్ బాబు, ఫిజియోథెరపిస్ట్ లు శ్రీధర్,కృష్ణప్రియ సమగ్ర శిక్ష సిబ్బంది రవి, విజయ కుమారి,పరిమళ, మియాభాష,అరుణ, షహనాజ్ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

