NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిర్మాణ పనుల నాణ్యతను,పురోగతిని పరిశీలించిన ఎమ్మెల్యే

1 min read

కూటమి ప్రభుత్వంలో రోడ్లు మరమ్మతులు నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:రహదారులపై చేపట్టే మరమ్మత్తులైన, నూతన నిర్మాణాల అంశంలో అయినా పూర్తిస్థాయిలో నాణ్యతను, నిబంధనలను పాటిస్తూ పనులు పూర్తి చేయాలని, సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నిర్మాణ పనుల నాణ్యతను, పురోగతిని పర్యవేక్షించాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు మండలం సోమవరపాడు గ్రామం నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్లే రహదారిలో మరమ్మత్తులు జరుగుతున్న సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్  శుక్రవారం ఉదయం  రోడ్ల పనులను స్వయంగా పరిశీలించారు.పనులు సంతృప్తికరంగా లేవంటూ, నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించేలా చూడాలని కోరుతూ జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వీడియో కాల్ ద్వారా తెలియచేశారు.ఈ సందర్భంగా గుత్తేదారు ప్రతినిధులకు, కార్మికులకు పలు సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఐదేళ్ల వైసిపి పాలనలో రోడ్లు మొత్తం అధ్వానంగా మారాయని, కనీసం ప్రజా సమస్యలు పట్టించుకోకుండా దోచుకోవటం, దాచుకోవటమే లక్ష్యంగా పాలన కొనసాగించారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నా కూడా ప్రధానంగా రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టడంతో పాటు పలుచోట్ల రోడ్ల నిర్మాణ పనులు సైతం వేగవంతం చేయడం జరిగిందని అన్నారు.త్వరితగతిన మరిన్నిచోట్ల రహదారుల సమస్యను పరిష్కరించేందుకు కూటమీ ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని తెలిపారు.

About Author