NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బదిలీపై వెళ్లిపోయిన ఉపాధ్యాయులకు వీడ్కోలు సన్మానం

1 min read

హొళగుంద న్యూస్ నేడు : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలహొళగుంద నందు విద్యార్థుల కోరిక మేరుకు2023-25 సంవత్సరంలో పనిచేసి ఇక్కడ నుండి బదిలీపై వెళ్లిపోయిన ఉపాధ్యాయులకు వీడ్కోలు సన్మానం అలాగే మెగాడిఎస్సి 2025 నందు వచ్చిన కొత్త ఉపాధ్యాయులకు స్వాగత సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కబీర్ సాబ్ పాత ఉపాధ్యాయుల సేవలను, పాత ప్రధాన ఉపాధ్యాయులకు సేవలను కొనియాడారు. కొత్త ఉపాధ్యాయులను ఉద్దేశించి విద్యార్థులకు మంచి విద్యను అందించాలని కోరారు పాత పూర్వ హెచ్,ఎం ,నజీర్ అహ్మద్ మాట్లాడుతూ తన హాయంలో తన సహాయ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఇందులో అందరూ ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ద్వారకనాథ్ ఆచారి కమిటీ మెంబర్లు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author