వట్లూరు గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన ఏలూరు ఎంపీ
1 min read

విద్యార్థులతో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీ
కళాశాలకు,విద్యార్థులకు సమస్యలు,అవసరాలు తన దృష్టికి తీసుకువస్తే కృషి చేస్తానని హామీ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: వట్లూరు బాలికల గురుకుల పాఠశాలను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సందర్శించారు.తరగతి గదుల పరిశీలన, విద్యాబోధన తీరుపై అధ్యాపకులతో చర్చరు.హాస్టల్ నిర్వహణ,ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించి విద్యార్థులకు మంచి ఆహారాన్ని మెనూ ప్రకారం అందించాలన్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి పాఠశాల క్యాంటీన్లోనే విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనంచేశారు.ఆధ్యాపకులకు,వార్డెన్, కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు.వట్లూరు బాలికల గురుకుల పాఠశాలను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. గురుకుల పాఠశాలలో తరగతి గదులను పరిశీలించారు. భోజనశాలను తనిఖీ చేసి వసతి సౌకర్యాలు, ఆహార పదార్థాల మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. గురుకుల పాఠశాలను పరిశుభ్రంగా అన్ని సౌకర్యాలతో, ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్న అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని, ప్రిన్సిపల్ ని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభినందించారు. విద్యార్దులను ఉన్నత విద్యావంతులుగా సత్ప్రవర్తనతో తీర్చి దిద్దాల్సిందిగా అధ్యాపకులకు సూచనలు చేశారు. ఏమైనా సమస్యలు, అవసరాలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రిన్సిపల్ దాసరి ఝాన్సీ కి హామీ ఇచ్చారు.

