కురువ దేవశంకర్ ను సత్కరించిన జిల్లా కురువ సంఘం నేతలు
1 min read

కర్నూలు , న్యూస్ నేడు: జిల్లా అభివృద్ధి సమన్వయము పర్యవేక్షణ కమిటి ( దిశ )సభ్యులు కురువ దేవశంకర్ ను సత్కరించిన జిల్లా కురువ సంఘం నేతలు…………… కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి లో కీలక పాత్ర పోషించే జిల్లా అభివృద్ధి సమన్వయము పర్యవేక్షణ కమిటి (దిశ ) సభ్యులు కురువ దేవశంకర్ ను శనివారం పంచలింగాల లోని ఎంపీ నివాసంలో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలోజిల్లా గౌరవ సలహాదారులు టి. పాలసుంకన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కే. రంగస్వామి, ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ,జిల్లా కోశాధికారి కే.సీ. నాగన్న తదితరులు కర్నూల్ పార్లమెంట్ సభ్యులు బస్తిపాడు నాగరాజు ని దిశ సభ్యులు కురువ దేవశంకర్ ను శాలువాతో సత్కరించి భక్త కనకదాసు జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

