మైనారిటీల అభివృద్ధికి తోడ్పాటు నందించండి..
1 min read

హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద మండల కేంద్రంలోని స్థానిక మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ కె.జాకీర్ శనివారం కర్నూలు లోని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సబిహా పర్వీన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు ఆమెతో మైనారిటీ నియోజకవర్గంలోని మైనారిటీ సమస్యలపై మాట్లాడారు. ఇందులో భాగంగా ఆలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లాలోని వెనుకబడిన ప్రాంతమని, ఇందులో భాగంగానే హొళగుంద మండలంలో కూడా అధికంగా మైనారిటీలు మరియు యువకులు ఉన్నారని, ముఖ్యంగా మైనారిటీలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు వివరించాలని అన్నారు. మైనారిటీ యువకులకు ప్రభుత్వం ద్వారా విద్య ఉపాధి నైపుణ్యం శిక్షణ తదితర అవకాశాలను కల్పించి వారికి ప్రత్యేక శిక్షణను కల్పించి ఉపాధి రంగాలలో మెరుగైన అవకాశాలు కల్పించి మైనారిటీల అభివృద్ధికి తోడ్పాటు నందించాలని కోరారు. అలాగే మండల కేంద్రంలోని స్థానిక మైనారిటీ స్మశాన వాటికకు కాంపౌండ్ వాల్ నిర్మించాలని, ఈద్గా మైదానానికి సైతం కాంపౌండ్ వాల్‌ను నిర్మించి మైనారిటీల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ఇందుకు స్పందించిన జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సబిహా పర్వీన్ త్వరలోనే ఈద్గా మరియు మైనారిటీ స్మశాన వాటికకు కాంపౌండ్ వాల్ నిర్మించేలా వక్ఫ్ బోర్డు ద్వారా నిధులు మంజూరు చేసేలా ప్రణాళికలను వక్ఫ్ బోర్డు ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. అలాగే మైనారిటీ యువకుల కోసం శిక్షణ ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని మైనారిటీ నాయకులు కె.సద్దాం, తదితరులు పాల్గొన్నారు.

