పలుచోట్ల రవాణా శాఖ ఏఎంవిఐ లు ఫ్రెండ్లీ తనిఖీలు
1 min read

అత్యవసర ద్వారా పనితీరు,పై తనిఖీలు
బస్సులో ఫిట్నెస్,ప్రామాణిక పరిణామాలు పై తనిఖీలు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు పాఠశాల బస్సులపై ఫ్రెండ్లీ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఏలూరు నూజివీడు, పెదపాడు, జంగారెడ్డిగూడెం, నిడమర్రు మరియు కలిదిండి ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి. ఉదయం, సాయంత్రం కూడా ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా బస్సులకు ఉండవలసిన ప్రామాణిక ప్రమాణాలు ఉన్నాయా లేవా అత్యవసర ద్వారాల పనితీరు వంటి వాటిని తనిఖీ చేశారు అంతేకాకుండా బస్సుల ఫిట్నెస్ను తనిఖీ చేశారు. స్వయంగా వారే వాహనాలను నడిపి బస్సుల పనితీరును తనిఖీ చేశారు ఏఎంవి ఐ లు స్వామి, జగదీష్ ,ప్రజ్ఞ,జమీర్, నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.


