డిసెంబర్ 9న జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం
1 min read

12 అంశాలపై సమీక్ష సమావేశం
జాతీయ దళిత నేత డా: పొలిమేర హరికృష్ణ
పలు రాష్ట్రాల నుంచి నాయకులు పాల్గొనున్నారని వెల్లడి
పలువురు నేతలు గోడపత్రికలు ఆవిష్కరణ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పార్టీలకతీతంగా ప్రజాసంఘాల నాయకులు,ఉద్యమ నాయకులతో 12 అంశాల ఎజెండా తో, డిసెంబర్ 9వ తేదీన జాతీయస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు, జాతీయ సీనియర్ దళిత నేత అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్: పొలిమేర హరికృష్ణ స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్. డాక్టర్: యార్లగడ్డ జగన్మోహన్రావు వీధి విజేత గ్రాండ్ ఏ/సీ ఫంక్షన్ హాల్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.ఏపీ విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు పెంపు,ఎస్సీ బ్రైట్ స్టూడెంట్స్ పథకం, ఎన్ఎస్ఎఫ్డిసి పథకం,కుల వివక్ష, రాజ్యాంగ పరిరక్షణ, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్స్, దళిత వాడ లలో స్మశాన వాటికలు,స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్స్ అమలు తీరు తెలుగు రాష్ట్రాలలో సోదర ఉపకులమైన రెల్లి సోదరుల రాజకీయ ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చ జరిపి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు బృందంగా ఏర్పడి నివేదించనునట్లు హరికృష్ణ తెలియజేశారు.జాతీయ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు మాట్లాడుతూ జాతీయస్థాయి ప్రజా సంఘాల నాయకులతో జరిగే జాతీయ రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణ,రాయలసీమ,వివిద జిల్లాల నాయకులు పాల్గొంటున్నారని ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సోoగ.మధుసూదన్ రావు,యర్రా.నాగ మల్లేశ్వరరావు,ఉండి నాగేశ్వరరావు,వెంట్రపాటి సురేష్, కుల వృక్ష పోరాట సమితి నాయకులు పరిసపోగు బాలరాజు, కె.జయప్రకాష్ , మాజీ కార్పొరేటర్ రాయి విమలాదేవి, సీనియర్ జర్నలిస్ట్ యర్రా.జయదాసు,ఎన్.దావీదు, సిహెచ్.వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమం గోడ పత్రికలను పలువురు నేతలు ఆవిష్కరించారు.

