ఎయిడ్స్ నివారణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
1 min read

డిఎల్ ఎస్ఏ జడ్జ్ కె.రత్న ప్రసాద్
ఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తమై ఉండి. విద్యార్థిని విద్యార్థులు, పౌరులు సామాజిక బాధ్యతగా కార్యక్రమాలు నిర్వహించాలి
స్వచ్ఛంద సంస్థలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మెమెంటో,ప్రశంసాపత్రం నగదుతో సత్కారం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: హెచ్ఐవి,ఎయిడ్స్ నివారణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిఎల్ఎస్ఎ జడ్జ్ కె.రత్న ప్రసాద్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని ఏలూరు ఇండోర్ స్టేడియంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా కార్యక్రమాన్ని ర్యాలీతో జండా ఊపి ప్రారంభించిన సీనియర్ సివిల్ జడ్జ్ రత్నం ప్రసాద్ ఫైర్ స్టేషన్ మీదుగా ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ నుంచి ఇండోర్ స్టేడియం చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు సమాజంలో పౌరులు ఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తమై ఉండి సామాజిక బాధ్యతగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు సాంకేతిక ద్వారా సక్రమమైన రీతిలో అవగాహన పొందాలని విద్యార్థిని విద్యార్థులను కోరారు.అనంతరం ఈ సందర్భంగా దిశా అనుబంధ విభాగాలైన ఐ సి టి సి, ఏఆర్ టి, డి ఎస్ ఆర్ సి, పీహెచ్సీ, స్వచ్చంద సంస్థలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి మెమొంటోలు, నగదు బహుమతులు, ధ్రువ పత్రాలతో సత్కరించారు. అందరూ హెచ్ వై ఫై అవగాహన కలిగి క్షేత్రస్థాయిలో దానిని నిర్మూలించేందుకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డి ఐ ఓ డాక్టర్ శోభ, డాక్టర్లు సత్యనారాయణ, బ్యుల ఫ్లారెన్స్ ,ఎం.శ్రీనివాస్, నజరేన్,దిశ జిల్లా సూపర్వైజర్ ఏ.హరినాథ్ కుమార్,జిల్లా ఎం అండ్ ఈ, అధికారి సామర్ల విజయలక్ష్మి, షేర్ ఇండియా పీఓ జి జగదీష్, ప్రిజన్ కోఆర్డినేటర్ కె.వినోద్ కుమార్,డిఆర్పి రాజశేఖర్,తదితరులు పాల్గొన్నారు.

