NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పదోన్నతి పొందిన వేల్పుల ఆనంద్ కు ఘణసత్కారం

1 min read

మాల మహానాడు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కార్యక్రమం..

నందికొట్కూరు , న్యూస్​ నేడు:  తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఐఆర్ఎస్ గా పదోన్నతి పొందిన వేల్పుల ఆనంద్ కుమార్ ను నందికొట్కూరు మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలతో ఘనంగా సత్కరించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో సీఎస్ఐ చర్చి ప్రాంగణంలో జరిగిన కార్యక్రమం కనీ వినీ ఎరుగని రీతిలో ఈ కార్యక్రమం జరిగింది.మాల మహానాడు నందికొట్కూరు తాలూకా అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో పట్టణంలో వేల్పుల ఆనంద్ కుమార్ కు ఘన స్వాతం పలికారు.ఈ కార్యక్రమానికి వెలుగోడు, ఆత్మకూరు మరియు నందికొట్కూరు నియోజకవర్గం నుండి భారీగా తరలివచ్చి ఆయనను శాలువాలు పూల మాలలతో ఘనంగా సత్కరిస్తూ రాబోయే రోజుల్లో మరింతగా ఉన్నత పదవులు పొందాలని దేవుని ఆశీస్సులు వేల్పుల ఆనంద్ కుమార్ పై ఉండాలని వక్తలు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో వెలుగోడు సర్పంచ్ వేల్పుల జయపాల్, పాములపాడు బీసీ నాయకులు శంకర్ గౌడ్, కొత్తపల్లి మల్లయ్య,మాల మహానాడు నాయకులు పెరుమాళ్ళ మధు,బండారి శ్రీను,నల్లమల ఏసన్న,శేఖర్, శెట్టి కిషోర్,ధర్మరాజు చెరుకు నడిపెన్న,మల్రెడ్డి రవి కుమార్,కేడెం ఏసురత్నం, విల్సన్,నాగేంద్ర,చింతలపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

About Author