బాధ్యతలు చేపట్టిన జిఎస్ డబ్ల్యూఎస్ అధికారులు
1 min read

మిడుతూరు-సురేష్ కుమార్, నందికొట్కూరు- పాండురంగారెడ్డి..
నందికొట్కూరు , న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు మండల గ్రామ మరియు వార్డు సచివాలయాల అధికారులుగా సోమవారం వివిధ మండల పరిషత్ కార్యాలయాల్లో వారు బాధ్యతలు స్వీకరించారు.నందికొట్కూరుకు-పాండు రంగారెడ్డి,మిడుతూరుకు-జి. సురేష్ కుమార్,పగిడ్యాలకు-మన్సూర్ భాష,జూపాడుబంగ్లాకు-మోహన్ నాయక్,పాములపాడుకు- తిరుపాలయ్య,కొత్తపల్లెకు-పిఎస్ఆర్ శర్మ లను జిల్లా అధికారులు నియమించారు.ఆరు మండలాల అధికారులు సోమవారం నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యను మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.మిడుతూరు మండల గ్రామ మరియు వార్డు సచివాలయాల అధికారిగా బాధ్యతలు చేపట్టిన జి సురేష్ కుమార్ గతంలో మిడుతూరు లో 06:06:2023 నుండి 04:10:2024 వరకుసీనియర్ అసిస్టెంట్ గా పనిచేశారు ఇక్కడ నుండి కర్నూలు జిల్లా పరిషత్ కు బదిలీపై వెళ్లారు.మళ్లీ అక్కడి నుండి మిడుతూరుకు జిఎస్ డబ్ల్యూ ఎస్ అధికారిగా బదిలీపై వచ్చారు.


