NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాజీ సైనికుల భూమి కబ్జా దారుడు రవిశంకర్ గౌడ్ పై చర్యలు తీసుకోవాలి

1 min read

కర్నూలు, న్యూస్ నేడు:  మాజీ సైనిక కుటుంబ భూమిపై నకిలీ పట్టా రద్దుకై – రవి శంకర్ గౌడ్ అక్రమ ఆక్రమణపై జాయింట్ కలెక్టర్ కి పిజీఆర్​ఎస్​ లో ఫిర్యాదు.కర్నూలు జిల్లా, కర్నూలు రూరల్ మండలం, భూపాల్ నగర్, మిలటరీ కాలనీకి చెందిన పి. జాన్  జిల్లా జాయింట్ కలెక్టర్ కి సోమవారం పిజీఆర్​ఎస్​ లో  ఫిర్యాదు సమర్పించారు. మాజీ సైనిక కుటుంబానికి కేటాయించిన భూమిని నకిలీ పట్టు, రికార్డుల మాయచేసి, అక్రమంగా కబ్జా చేసిన ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.ఫిర్యాదులో ఉన్న వివరాల ప్రకారం,   కుటుంబ సభ్యులు పి.జాన్ మాట్లాడుతూ రెండవ ప్రపంచ యుద్ధంలో భారత సైన్యంలో సేవలందించిన మా తండ్రి లేట్ శ్రీ పి. జ్ఞానముని  సేవలకు గుర్తింపుగా, ప్రభుత్వం ఆయన భార్య అంటే మా తల్లిగారు లేట్ శ్రీమతి పి. కరుణమ్మ  పేరుతో కర్నూలు రూరల్ మండలం, రుద్రవరం గ్రామంలో వివిధ సర్వేనెంబర్లలలో 5 ఎకరాలకు పైగా భూమిని కేటాయించారు అందులో బాగంగా సర్వే నం. 608-Hలో 2 ఎకరాలు 30 సెంట్లు భూమిని  కేటాయించారు.జాయింట్ పట్టాగా ఆర్మీకి కేటాయించిన భూమిలో ఇతనికి మధ్యలో పట్టా పుట్టింది అన్నారు ఇతను ఏ ఆర్మీకి చెందిన వాడు కాదు అన్నారు, కావు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ని కోరామన్నారు.మాజీ సైనిక కుటుంబానికి న్యాయం చేస్తారని జిల్లా  కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ పై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వారి కుమారులు, కిరణ్, విజయ్, మరియు గ్రామస్థులు ఉన్నారు.

About Author