పత్తి రైతులను వెనక్కి పంపించవద్దు
1 min read
జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి
కర్నూలు, న్యూస్ నేడు: పత్తి లో తేమ శాతం సీసీఐ వారు కొనుగోలు చేసే దాని కంటే ఎక్కువ శాతం ఉన్నట్లయితే రైతులను వెనక్కి పంపించకుండా మిల్లుల ద్వారా కొనుగోలు చేయించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి మార్కెటింగ్ ఏడి ని ఆదేశించారు.బుధవారం ఆదోని లో బత్తిన అభిరామ్, లక్ష్మీ చెన్నకేశవ జిన్నింగ్ & ప్రెస్సింగ్ యూనిట్ లలో సీసీఐ ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు..ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ ఏ మండలం నుండి వచ్చారు, తీసుకొచ్చిన పత్తిని సిసిఐ వారు కొనుగోలు చేశారా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ రైతులను ఆరా తీశారు? తాము తీసుకొచ్చిన పత్తిని తేమ శాతం ఆధారంగా సీసీఐ వారు కొనుగోలు చేస్తున్నారన్నారు.. కొంచెం రంగు మారినట్లయితే కొనుగోలు చేయడం లేదని, స్లాట్ బుకింగ్ లో సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు కలెక్టర్ కి వివరించారు… స్లాట్ బుకింగ్ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు.. స్లాట్ బుకింగ్ చేసే సమయంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది సాయం చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు… పత్తిని తీసుకొని వచ్చే సమయంలో బాగా ఆరబెట్టి , పొట్టు తీసుకొని రావాలని కలెక్టర్ రైతులకు సూచించారు… వచ్చే సారి పత్తి పంట వేసినట్లయితే, ఇప్పటి లాగా పత్తి పంట ఒకటే వేసి వాటి మీద ఆధారపడకుండా, పత్తి పంట మధ్యలో కంది పంట వేయాలని కలెక్టర్ రైతులకు సూచించారు…పత్తి కొనుగోలు కేంద్రాలలో తూకం యంత్రాలలో సాంకేతిక లోపాలు లేకుండా చూడాలన్నారు.
తూకపు యంత్రాలు, మాయిశ్చరైజర్ మెషిన్ ను స్వయంగా పరిశీలించిన కలెక్టర్
పత్తి కొనుగోలు ప్రక్రియలో భాగంగా తూకం యంత్రాలు ఏ విధంగా పని చేస్తున్నాయని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.. అనంతరం పత్తి తేమ శాతం ఎంత ఉందని కలెక్టర్ మాయిశ్చరైజర్ మెషిన్ ద్వారా స్వయంగా పరిశీలించారు.కార్యక్రమంలో ఆదోని ఇంచార్జ్ సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, మార్కెటింగ్ ఏడి నారాయణమూర్తి, వ్యవసాయ శాఖ అధికారి బాలవర్ధి రాజు, ఆదోని తహసిల్దార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


