డ్రగ్స్ వినియోగం వల్ల భవిష్యత్ అంధకారం అవుతుంది
1 min read

డా.కె.వేణుగోపాల్, సీఈఓ సెట్కూరు
కోడుమూరు , న్యూస్ నేడు: జిల్లా యువజన సంక్షేమ శాఖ – సెట్కూరు ఆధ్వర్యంలో కోడుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు మత్తుపదార్థాలు వ్యసనం – పర్యవసానాలు, సైబర్ క్రైమ్ అనే అంశాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో సెట్కూరు సీఈఓ డా!! కె.వేణుగోపాల్ గారు మాట్లాడుతూ యువతకు సిగరెట్లు, మద్యపానం సేవించడం అనేది ఫ్యాషన్ గా అలవాటు అవుతున్నదని, ఈ అలవాట్లే ముదిరిపోయి డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని, డ్రగ్స్ వినియోగిస్తున్నారని తెలిస్తే వ్యక్తిగత సంబంధాలు, బంధువులు, స్నేహితులు కూడా దూరం అవుతారని, డ్రగ్స్ వినియోగం వల్ల భవిష్యత్ అంధకారం అవుతుందని డ్రగ్స్ ఉపయోగం వల్ల యువత మరియు సమాజం మీద పడుతున్న దుష్పలితాలను వివరించారు . ప్రోహిబిషన్ & ఎక్సైజు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి యం.మంజుల మాట్లాడుతూ డ్రగ్స్, మత్తు పదార్థాలు మానవ అవయవ వ్యవస్థలు ముఖ్యంగా మెదడు, గుండె, కాలేయం మొదలగునవి దెబ్బతింటాయని, రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కావున డ్రగ్స్ జోలికి వెళ్లవద్దని, డ్రగ్స్ / మత్తు పదార్థాలు వినియోగించిన లేదా డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికిన కఠిన శిక్షలు పడతాయనని, మీకు దగ్గరలో డ్రగ్స్ అమ్ముతున్న తెలిస్తే పోలీసులకు టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. తదుపరి శ్రీమతి జె.లక్ష్మి మాట్లాడుతూ మాదకద్రవ్యాల సరఫరా వెనుక ఉన్నవారిని సామాజికంగా బహిష్కరించాలని కోరారు. ప్రిన్సిపాల్ శ్రీ షైక్షావాలి మాట్లాడుతూ యువత చదువుకునే వయసులో చదువు ఫై మాత్రమే మనసు లగ్నం చేయాలని, చేడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెట్కూరు సూపరింటెండెంట్ శ్రీ డి. శ్యాంబాబు , కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

