పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా : డిఈఈ
1 min read

గురుకులంలో ఘనంగా తల్లిదండ్రుల సమావేశం..
నందికొట్కూరు, న్యూస్ నేడు: పాఠశాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని అంతేకాకుండా తన సొంత ఖర్చుతో విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని విద్యుత్ శాఖ నందికొట్కూరు డిఈ శ్రీనివాసులు అన్నారు. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం(పీ టీఎం-3.0) ప్రిన్సిపాల్ సత్య నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఈ హాజరయ్యారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ జయన్న మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని అన్నారు.ఈ పాఠశాల విద్యార్థులు 10 మరియు ఇంటర్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని ఒక విద్యార్థికి జిల్లా కలెక్టర్ 20 వేల నగదు ప్రోత్సాహం అందించారని ప్రిన్సిపాల్ సత్య నారాయణమూర్తి అన్నారు. తర్వాత పాఠశాలకు సహకారం అందించిన తల్లి దండ్రులను శాలువాలతో సత్కరిస్తూ బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో వయసు ప్రిన్సిపాల్ దామోదర్ రెడ్డి,సుబ్బారెడ్డి,ఫిజికల్ డైరెక్టర్ విజయ భాస్కర్ రెడ్డి,శ్రీనివాసులు,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


