వంద రోజుల ప్రణాళిక ప్రకారం పిల్లలను చదివించాలి
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: వంద రోజుల ప్రణాళిక ప్రకారం పిల్లలను చదివించాలని పాఠశాల సమితి కార్యదర్శి. ఎం. రామాంజినేయులు, పాఠశాల కార్యదర్శి బి. సి విజయకుమార్ అన్నారు.ఈసందర్భంగా శుక్రవారం ప్యాపిలి పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిరం పిటిఎం కార్యక్రమంపదవ తరగతి పోషకురాలు లక్ష్మీ చేత పూజ కార్యక్రమం నిర్వహించారు.పాఠశాలలో 10 వ తరగతి వారికి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సమావేశం 10 గంటలకు ప్రారంభం అయి 1 గంటకు ముగిసింది. ఈ కార్యక్రమం కు పాఠశాల సమితి కార్యదర్శి.. ఎం. రామాంజినేయులు మరియు పాఠశాల కార్యదర్శి బి. సి విజయకుమార్ ముఖ్య అతిథిధులు గా హాజరయ్యారు .సమితి కార్యదర్శి తన ప్రసంగం లో పిల్లల తల్లిదండ్రులకు తగు సూచనలు చేశారు. ఎలా చదవాలి? ఎలా చదివితే మంచి మార్కులు వస్తాయో తెలిపారు. విజయకుమార్ ప్రసంగం లో పిల్లల కు నేర్పాల్సిన సంస్కారములు తెలియజేశారు. సమితి మెంబెర్ కృష్ణ రెడ్డి పాఠశాలకు ప్రతి రోజు హాజరు కావాలని, పిల్లల్లు పని చేయకుండా చదువుకోవాలని, వంద రోజుల ప్రణాళిక ప్రకారం పిల్లలను చదివించాలని తెలియజేశారు. అనంతరం పిల్లల తల్లిదండ్రులకు FA-1,FA-2,SA-1 మార్కుల పట్టికలను అందజేశారు. ఈ కార్యక్రమం లో 10 వ తరగతి బోధించే ఆచరులు కే. పార్వతి, జయంతి లక్ష్మి, మహమ్మద్ భాష, రమణయ్య, యూ. రామాజినేయులు, మహేష్, లావణ్య మొదలగు ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.

