NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజీ యాజమన్యం నిర్లక్ష్యంపై విధ్యార్థులు ఆందోళన

1 min read

కర్నూల్, న్యూస్​ నేడు:  కర్నూల్ నగరంలోని ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులతో యాజమాన్యం జులై నెలలో పరీక్ష రుసుము కట్టించుకొని, బోర్డు కి చెల్లించనందు వల్లన కొందరు విద్యార్థులకు హాలీటికెట్స్ రాలేదు. ఈ విషయం పైన సదరు విద్యార్థులు సదరు ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సలోమి ని నీలాదీయగా ఆమె స్పందిస్తూ యాజమాన్యం వల్లన తప్పు జరిగింది అని విద్యార్థుల ఎదుట అంగీకరించినట్టు భాదిత విద్యార్థులు తెలియజేశారు. ఈ అంశం లో తగిన న్యాయం జరిగేలా కృషి చేయాలని భాదిత విద్యార్థులు విద్యార్థి సంఘం నాయకులను ఆశ్రయించగా. విద్యార్థి నాయకులు భాస్కర్ నాయుడు, కటారుకొండ సాయి కుమార్, కడుమూరు గిరీష్ ల ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలకు చేరుకొని యాజమాన్యం వారితో మాట్లాడేందుకు ప్రయత్నించగా కళాశాల సిబ్బందిలో కొంతమంది విద్యార్థి నాయకులు, విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించగా ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో యాజమాన్యం వారు మీడియా ప్రతినిధులను కూడా దూసించినట్లు సమాచారం. ఈ గంధరగోల వాతావరణం మధ్య కళాశాల ప్రిన్సిపాల్ సలోమి సంఘటన స్థలం నుండి వెళ్లిపోయారు. ఈ సందర్బంగా విద్యార్థి నాయకులు భాస్కర్ నాయుడు, కటారుకొండ సాయి కుమార్, కడుమూరు గిరీష్ లు మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం వారి అవినీతి, అక్రమాల పైన కఠిన చర్యలు తీసుకొనేలా పోరాటం ఉదృతం చేస్తాము అని తెలియజేశారు. కార్యక్రమం లో విద్యార్థి సంఘాల నాయకులు ఖాజా హుస్సేన్, కురువ రంగన్న, పవన్, హరి తదితరులు పాల్గొన్నారు.

About Author