ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
1 min read
విద్య వల్ల గుర్తింపు, మంచి భవిష్యత్
కష్టపడి చదివి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
కర్నూలు, న్యూస్ నేడు : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోందనిజాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ వెల్దుర్తి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య మంచి బంధం ఏర్పరిచేందుకు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. నేడు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం రూ. 6 నుండి 8 వేల వరకు ఖర్చు చేస్తోందన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో నే చదివి ఐఎఎస్ స్థాయికి ఎదిగానని, విద్యార్థులు తన లాంటి వారిని స్పూర్తిగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు..విద్య వల్ల గుర్తింపు, మంచి భవిష్యత్ లభిస్తుందన్నారు.. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ఆ లక్ష్యం చేరేదాక కష్టపడి చదివితే, సాధ్యం కానిది ఏదీ లేదని జేసీ విద్యార్థినులను ప్రోత్సహించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు బాగాచదువుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. బాల్య వివాహాలు చేయకూడదని, ఆడపిల్లల్ని బాగా చదివించాలని జేసీ సూచించారు.తొలుత జేసీ పాఠశాల లో నీటి వసతి, టాయిలెట్ లు, వంట గది ని పరిశీలించారు. తరగతి గదులకు వెళ్ళి విద్యార్థులతో సంభాషించారు.. ప్రోగ్రెస్ కార్డు లను పరిశీలించారు. తల్లిదండ్రులతో ముచ్చటించారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్ర శేఖర్ వర్మ, ఎంపిడిఓ, హెడ్ మాస్టర్, విద్యా కమిటీ చైర్మన్ రాజేష్, మండల నాయకులు జ్ఞానేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


