హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు సేవలు అభినందనీయం -మాజీ రాజ్యసభ సభ్యులు వెంకటేష్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందించదగ్గవని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక మౌర్య ఇన్ కాంప్లెక్స్ నందు ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆవరణంలో బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు స్థాపించిన అనతి కాలంలోనే బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందిందన్నారు. తక్కువ వడ్డీ రేటుతో సులభంగా రుణాలు మంజూరు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుందన్నారు. సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1200 బ్యాంకు బ్రాంచీలలో ఇటువంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇది అందరికీ సాధ్యమయ్యేది కాకపోయినప్పటికీ దాన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాజమాన్యం, మరియు సిబ్బంది సుసాధ్యం చేసి చూపించారన్నారు. ఇప్పటికే 50 లక్షల పైగా ఖాతాదారులు ఉన్నటువంటి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ మరింత అభివృద్ధి చెదడంతోపాటు ప్రజల కొరకు మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నానని టీజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది నున్న కుమార్, సతీష్, మహమ్మద్ గౌస్, విజయమోహన్ రెడ్డి, శశాంక్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

