కస్తూర్బా పాఠశాలలో ఘనంగా తల్లిదండ్రుల సమావేశం
1 min read
ప్రభుత్వ పాఠశాలల్లో పీటీఎం-3.0 సమావేశాలు
మిడుతూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా బాలికల పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల (పీటీఎం-3.0)సమావేశాన్ని పాఠశాల ఎస్ఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సమావేశానికి టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, ఎంపీడీవో దశరథ రామయ్య, తహసిల్దార్ శ్రీనివాసులు, గ్రామ సర్పంచ్ జయ లక్ష్మమ్మ మరియు తల్లిదండ్రులు హాజరయ్యారు.పాఠశాలలో రకరకాల స్టాల్స్ ను బాలికలు తయారు చేయడంతో వచ్చిన వారందరూ చాలా చక్కగా తిలకించారు.వీటితో పాటు దేశభక్తి పాటలకు చాలా చక్కగా నృత్యాలు చేయడంతో విద్యార్థులను అభినందించారు.విద్యార్థులు చక్కగా చదువుకొని పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరచాలని పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఖాతా రమేష్ రెడ్డి మరియు ఎంపీడీవో,తహసిల్దార్ విద్యార్థులకు సచించారు. మోడల్ పాఠశాలలో ప్రిన్సిపాల్ బీటీ శ్రీదేవి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా మండలంలోని వివిధ పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ వ్యోమ కేష్,అంగన్వాడీ సూపర్వైజర్ రేణుకా దేవి మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

