NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా మెగా పేరెంట్-టీచర్ 3.0

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూల్ నియోజకవర్గం లోని ప్రకాష్ నగర్ ఉర్దూ ప్రీ మెట్రిక్ స్కూల్ మరియు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు నగరపాలక ఉన్నత పాఠశాల, వన్ టౌన్ ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల(ఉర్దూ) జరిగిన మెగా పేరెంట్-టీచర్ 3.0 సమావేశాలలో పాల్గొన్న రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్కర్నూల్, డిసెంబర్ 5: ‘పేరెంట్ టీచర్స్ మీటింగ్ 3.0’ కార్యక్రమాలను ఉర్దూ ప్రీ మెట్రిక్ స్కూల్, శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు నగరపాలక ఉన్నత పాఠశాల మరియు వన్ టౌన్ ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల(ఉర్దూ) లో విద్యార్థులు, తల్లితండ్రులు మరియు ఉపాధ్యాయులతో కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న సూరి మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ… విద్యార్థుల చదువు, వారి ప్రవర్తన మరియు పాఠశాల అభివృద్ధి గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి చర్చించడం శుభపరిణామని, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేయడం ఎంత అవసరమో,  ఇటీవల నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం వేడుక‌ల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి టిజి భరత్  క‌ర్నూల్ లో ఉర్దూ యూనివ‌ర్శిటీ నిర్మాణానికి వ్యక్తిగతంగా కోటి రూపాయ‌లు స‌హ‌కారం అందిస్తాన‌ని ప్రక‌టించడంతో మైనారిటీ ప్రజలు ఎంతో హర్షిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు తెలియజేశారు.

About Author