అంబేద్కర్ సేవలు మరువలేనివి
1 min read

విజయవాడ , న్యూస్ నేడు : బడుగు బలహీన వర్గాల కోసం బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్, తూర్పు నియోజకవర్గం ఎస్ సి సెల్ అధ్యక్షులు దేవరపల్లి ఆంజనేయులు అన్నారు.జిల్లా పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.తొలుత అంబేద్కర్ చిత్రపటానికి రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్, తూర్పు నియోజకవర్గం ఎస్ సి సెల్ అధ్యక్షులు దేవరపల్లి ఆంజనేయులు పూలమాలవేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులను సరి సమానం చేసేందుకు కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని దళిత కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టాలు పడి పోరాటాలు త్యాగాలు చేసి భారత రాజ్యాంగం అనే గ్రంధాన్ని రచించిన ఒక విశిష్ట సంఘసంస్కర్తగా నిలిచారన్నారు.భారత ప్రజలందరి మధ్య స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం, ప్రజాస్వామ్య గణతంత్ర భావాలు విరజిల్లాలనేది అంబేద్కర్ ఆకాంక్ష అన్నారు. ఓటు అనే వజ్రాయుదాన్ని రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ప్రజలకు అందించారన్నారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీ, ఎస్సీ ,ఎస్టీలు అధికారంలోకి రావాలని ఆకాంక్షించారన్నారు. భారతదేశంలో నిమ్మ జాతి వర్గాల వారికి సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తి అంబేద్కర్ అని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ని, స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలు దాటిన బడుగు బలహీన వర్గాలు వారు అసమానతకు గురవుతున్నారు. నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన తర్వాత బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని, బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలిచారని, ఇప్పుడు చంద్రబాబు కూడా ఆయన అడుగుజాడల్లో పయనిస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరాం ప్రసాద్ గౌడ్, గౌడ కులహక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బోల్ గౌడ కులహక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బొల్లా వెంకటేశ్వరరావు గౌడ్, ఎన్టీఆర్ జిల్లా బీసీ గౌడసాధికారిక కన్వీనర్ పామర్తి కిషోర్ బాబు, వాకా వెంకటేశ్వరరావు గౌడ్, జాస్తి సురేష్, యార్లగడ్డ రమేష్, సజ్జ రవి, మల్లెల విజయకుమార్, కాటూరి సుబ్రహ్మణ్యేశ్వర రావు, గుమ్మడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

