డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని అందిపుచ్చుకొని ముందుకు సాగాలి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని అందిపుచ్చుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వి. వెంకట బసవరావు పిలుపునిచ్చారు. డాక్టర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని వర్సిటీలో పాత లైబ్రరీ భవనంవద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా ఆయన నివాళులర్పించారు. అనంతరం వి.సి. కాన్ఫరెన్సుహాలులో ఏర్పాటుచేసిన సమావేశంలో ఇటీవలే రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నదేశం అంబేద్కర్ సేవలను గుర్తుచేసుకుందన్నారు. వచ్చే సంవత్సరం అంబేద్కర్ జయంతికంతా వర్సిటీలో నిలువెత్తు విగ్రహ ఏర్పాటును పూర్తి చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.సమసమాజ రూపకల్పనలో అంబేద్కర్ కృషి ఎంతో ఉందని వర్సిటీకాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సి.విశ్వనాథరెడ్డి కొనియాడారు. ఈకార్యక్రమంలో వర్సిటీIQAC సమన్వయకర్త ఆచార్య ఆర్. భరత్ కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లుతోపాటు వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పరిశోధకులు పాల్గొని డాక్టర్ అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.

