చేప పిల్లలను వదిలిన జనసేన రవికుమార్
1 min read
మత్స్యకార కుటుంబాలపై డిప్యూటీ సీఎం అభిమానం..
నందికొట్కూరు, న్యూస్ నేడు: మత్స్యకార కుటుంబాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమానంతో ఉన్నారని అంతే కాకుండా వారి అభివృద్ధి ముందుకు వెళ్తున్నారని జనసేన పార్టీ నందికొట్కూరు ఇన్చార్జి నల్లమల రవికుమార్ అన్నారు.నంద్యాల జిల్లాపగిడ్యాల మండల పరిధిలోని నెహ్రూనగర్ గ్రామంలో శ్రీశైలం బ్యాక్ బెటర్ గోకరాజు కుంట దగ్గర మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడానికి చేపల ఉత్పత్తిని పెంచడానికి రవికుమార్ శనివారం చేప పిల్లలను వదిలారు.బిజెపి నాయకులు,ప్రభుత్వ మత్స్యకార శాఖ అధికారులు గ్రామ కమిటీ సభ్యులు చేప పిల్లలను వదిలినట్లు రవికుమార్ తెలిపారు.ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యకార సోదరులపైన ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉందన్నారు.ఉప్పాడ విషయమైతేనేమి, జీవో నెంబర్ 217 విషయమైతేనేమి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి మత్స్యకార సోదరులకు లబ్ధి పొందే విధంగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారన్నారు.ఈ చేప పిల్లల విడుదల వల్ల మత్స్యకారుల సహకార సంఘాల్లోని కుటుంబాల జీవనోపాధి మెరుగు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు,జనసేన పార్టీ వెంకటేష్,గంగాధర్ యాదవ్, మాసుం భాష,శ్రీను యాదవ్, బిజెపి పార్టీ అశ్విన్ పాల్గొన్నారు.

