NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక

1 min read

 ప్రజా ఫిర్యాదులు,సమస్యలపై తక్షణ చర్యలు చేపట్టాలి

అధికారులకు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ సూచనలు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సోమవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్, ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమమును  జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ మరియు అదనపు ఎస్పీ ఎన్. సూర్య చంద్రరావుఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు.ఈ కార్యక్రమంలో ఫిర్యాదుల స్వీకరణలో పారదర్శకత పూర్తిగా “పేపర్‌లెస్” పద్ధతిలో నిర్వహించబడింది.ప్రజలు తమ యొక్క విలువైన సమయాన్ని, డబ్బును వృథా చేయకుండా నేరుగా తమ సమీప సబ్-డివిజన్, సర్కిల్  పోలీసు అధికారులకు అంద చేయవచ్చని ఎస్పీ తెలిపారు.ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు చేయాలనుకునేవారు https://meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ ను ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడానికి 1100 టోల్-ఫ్రీ నెంబర్ ను సంప్రదించ వచ్చని తెలియజేశారు. ఈ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుదారులకు ఏలూరు శ్రీ సత్య సాయి సేవా సంఘం వారు భోజన ఏర్పాట్లు చేశారు.

About Author