ఏళ్ల కల..నెరవేరుతున్న వేళ
1 min read

పగిడ్యాల రోడ్డుకు మహర్దశ
నాలుగు కోట్ల రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమి పూజ..
నందికొట్కూరు, న్యూస్ నేడు: తరతరాలు మారినా ఇక్కడ ఎవరూ చేయనంత అభివృద్ధికి పునాది బాటలు వేస్తూ ఉండటంతో ఎన్నో ఏళ్లుగా ఉన్న ప్రజల కలలను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రయాణికుల కళల సాకారాన్ని నెరవేర్చేందుకు సోమవారం రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు నుండి పగిడ్యాల రోడ్డు ప్రయాణికులకు వాహనదారులకు ఈ రహదారి ప్రాణ సంకటంగా మారింది. నిత్యం వాహన చోదకులు ప్రమాదాలకు గురౌతున్న సంగతి తెలిసిందే.వీటి పరిష్కారం కోసం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసి ఈ రోడ్డు పరిస్థితి గురించి ఎమ్మెల్యే జయసూర్య మంత్రికి వివరించడంతో స్పందించిన మంత్రి బీసీ వెంటనే రోడ్డు వేయటకు నిధులు మంజూరు చేశారు.అందుకు గాను సోమవారం ఉదయం బీటి రోడ్డుకు ఎమ్మెల్యే 4 కోట్ల నిధులతో ఈ రోడ్డును పనులకు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం పేదల సంక్షేమం,అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు.నిర్మాణ పనులు నాణ్యతతో త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.ఈ రోడ్డు సరిగా లేక ప్రయాణానికి ఆయా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు.రహదారి కష్టాలు తీర నుండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర్ రెడ్డి,కడియం వెంకటేశ్వర్లు యాదవ్,శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రెడ్డి,రాజశేఖర్ రెడ్డి, జనసేన రవికుమార్ ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

