NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డివిఎల్ రాష్ట్రస్థాయి సదస్సులో కేఎంసి విద్యార్థి ప్రతిభ”..

1 min read

అభినందన తెలిపిన ఎడిఎంఈ & కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ

కర్నూలు, న్యూస్ నేడు:  కర్నూల్ మెడికల్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి,జాతీయ స్థాయి సదస్సు లలో మరియు స్పోర్ట్స్ లో ప్రతిభ  కనబరుస్తుండటం పట్ల వారిని అభినందిస్తూ మిగిలిన విద్యార్థులు వీరిని  ఆదర్శంగా తీసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఐ.ఎ.డి.వి.ఎల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 44వ యాన్యువల్ స్టేట్ కాన్ఫరెన్స్ 6  7 తేదీలలో తిరుపతిలోను ఎస్వి మెడికల్ కాలేజ్  డివీఎల్ డిపార్ట్మెంట్ నిర్వహణ బాధ్యతలతో స్టేట్ కాన్ఫరెన్స్ కాలేజి లోని భువన విజయం ఆడిటోరియం లో నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్రస్థాయి సదస్సులో రాష్ట్రంలోని వివిధ మెడికల్ కళాశాల నుంచి డివిఎల్ డిపార్ట్మెంట్ సీనియర్ ప్రొఫెసర్లు,అసోసియేట్ అసిస్టెంట్, పీజీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ సదస్సులో కర్నూల్ మెడికల్ కాలేజీ కి చెందిన పీజీ సెకండ్ ఇయర్ విద్యార్థి డా.యస్ మనురాజ్ ” “బెస్ట్ అవార్డు పేపర్ ఇన్  కేస్ రిపోర్టింగ్” లో ఉత్తమ పేపర్ ప్రజంటేషన్ కు గాను అవార్డు లభించడం జరిగింది. ఈ సందర్భంగా కర్నూల్ మెడికల్ కాలేజీ  డివిఎల్ డిపార్ట్మెంట్ విభాగాధిపతి డా. లెక్కల శ్రీదేవి, డిసిగ్నేటెడ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.గౌతమి శ్రీ  లు ప్రిన్సిపల్  కలవడం జరిగింది. ప్రిన్సిపల్ అవార్డు పొందిన విద్యార్థిని డివిఎల్ డిపార్ట్మెంట్ సిబ్బందిని అభినందనలు తెలుపుతూ మిగిలిన విద్యార్థులు కూడా ఆదర్శంగా తీసుకొని కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని కోరడం జరిగింది. ఆర్గనైజింగ్ చైర్ పర్సన్, ఎస్.వి.మెడికల్ కాలేజ్ డివిఎల్ విభాగాధిపతి డా. పి.శ్రీనివాసులు వివిధ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ రెండు రోజులు డివిఎల్ కు సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్ లపై విస్తృత చర్చ జరిగిందని తెలిపారు.

About Author