NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సొంత నిధులతో కాపు, బీసీ భవనాల నిర్మాణాల పూర్తి కి కృషి చేస్తున్నా

1 min read

కర్నూలులో ట్రాఫిక్ సమస్యల కు చర్యలు తీసుకుంటున్నాం

పరిశ్రమలు,వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్

కర్నూలు , న్యూస్​ నేడు: సొంత నిధులతో కాపు , బీసీ భవనాల నిర్మాణాలను పూర్తి చేయటానికి కృషి చేస్తున్నామని  పరిశ్రమలు,వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం కర్నూలు పట్టణ బి – కాంప్ లో ముందుగా కాపు భవనం  మరియు బీసీ  భవనాల పునః నిర్మాణానికి   మంత్రి టి.జి. భరత్ పూజలు నిర్వహించారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…2014 సంవత్సరం కాలం లో ఉన్న అప్పటి తెలుగుదేశ ప్రభుత్వం కాపు , బీసీ భవనాలు నిర్మాణానికి చర్యలు చేపట్టినదని నిధులు కేటాయించి నిర్మాణాలు బేస్ లెవెల్ స్థాయికి తీసుకొని రావటం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి స్థిరమైన ఎక్కువ కాలం ఉండే ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని , ఆ విధంగా స్థిరమైన ప్రభుత్వాలు ఉండడం వల్లనే సింగపూర్ , జపాన్ ,దుబాయి దేశాలు , గుజరాత్ వంటి రాష్ట్రాం అభివృద్ధి చెందాయని తెలుపారు. కర్నూలు పట్టణంలో రోడ్లను అభివృద్ధి చేస్తూ అవసరమైన ప్రదేశాల్లో రోడ్డు వెడల్పు చేస్తూ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న సేవలు గుర్తుంచుకుని, ప్రభుత్వానికి అన్ని విధాలుగా ఎల్లప్పుడు అండగా ఉండి  ఆశీస్సులు అందించాలని కోరారు. బీసీ భవన పూజా కార్యక్రమంలో అడ్వకేట్ శ్రీధర్ , నక్కమిట్టల శ్రీనివాసులు , రాంబాబు , రామకృష్ణ , బీసన్న మొదలగువారు మరియు ఈ రెండు పూజా కార్యక్రమాలకు బీసీ వెల్ఫేర్ అధికారిని ప్రసూన , బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్ మొదలగు అధికారులు పాల్గొన్నారు.

About Author