ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి
1 min read
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి
అన్నదాత సుఖీభవ పథకాన్ని భూమిలేని కౌలు రైతులకు అందించాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)ఏలూరు ఏరియా సమితి మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ధాన్యం, మొక్కజొన్న, పత్తి పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని, భూమి లేని కౌలు రైతులందరికి అన్నదాత సుఖీభవ పథకంతో పాటు బ్యాంకు రుణాలు ఇవ్వాలని, ధరలు పడిపోయి నష్టపోతున్న అరటి,నిమ్మ, బత్తాయి రైతులను ఆదుకోవాలని, మొంథా తుఫాను వలన పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీని చెల్లించాలని,రబీ పంట కాలంలో సాగు చేసిన పంటలన్నింటికి ఉచిత పంటల భీమా పథకం అమలు చేయాలని నినాదాలు చేశారు. సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ధాన్యం, మొక్కజొన్న, పత్తి తదితర పంటలకు కొనుగోలు నిబంధనలు సడలించి, మద్దతు ధరలకే కొనుగోలు చేయాలని, అరటి రైతులకు న్యాయం చేయాలని, ఉల్లి పంట రైతులకు హెక్టారుకు రూ.50 వేలు ఇస్తామని, భూమిలేని ప్రతి కౌలు రైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు అందజేస్తామని ప్రభుత్వం ఇచ్చిన అనేక వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొంథా తుఫాను వలన రూ.5500 కోట్లకు పైగా నష్టం జరిగితే ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.1000 కోట్ల మేర రైతులకు నష్టం జరిగింది. ఎన్యూమరేషన్ పూర్తిచేసి నెల రోజులైనా రైతాంగానికి నష్ట పరిహారం అందించలేదని విమర్శించారు.ఈ కార్యక్రమంలో ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, సహాయ కార్యదర్శి అడ్డగర్ల లక్ష్మి ఇందిరా,ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యులు,మావూరి విజయ,కొండేటి బేబీ,కొల్లూరి సుధారాణి,బళ్ల కనక దుర్గా రావు,గొర్లి స్వాతి,కొండేటి రాంబాబు,కౌన్సిల్ సభ్యులు భజంత్రీ శ్రీను,ఎం ఎ హకీమ్, వీరమల్లు దత్తాత్రయ,ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, షరీఫ్, నరేష్,వినోద్ ఉప్పులూరి లక్ష్మీ,భవాని,మేరీ, కొండేటి మేరీ,కేశవరావు, మరకాల సందీప్,సన్నీ, బేతా శంకర్, పళ్లెం కిషోర్,తదితరులు పాల్గొన్నారు.

