శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానo లో హుండీ లెక్కింపు
1 min read
63 రోజులకుశ్రీ స్వామి వారి హుండీ ఆదాయం రూ.50,91,526 /-లు
కార్యనిర్వాహణాధికారిని ఆర్.వి చందన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయి గూడెం గ్రాములో వేంచేసి యున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానము నందు హుండీలను తెరచి లెక్కించుట జరిగినది. సదరు లెక్కింపును శ్రీయుత కూచిపూడి శ్రీనివాసు, జిల్లా దేవదాయ శాఖ అధికారి, దేవదాయ ధర్మదాయ శాఖ, ఏలూరు వారి పర్యవేక్షణలో కే.వీ.బీ .బ్యాంక్ సిబ్బంది సమక్షమున హుండీలను తెరచి లెక్కించగా 63 రోజులకు గాను దేవస్థానము హుండీల ద్వారా రూ.48,82,724/- అన్నదానం హుండీ ద్వారా రూ.2,08,802/- లు మొత్తం ఆదాయం రూ.50,91,526 /- లు దేవస్థానమునకు సమకూరినది అని ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెలియజేసినారు.


