కూటమి ప్రభుత్వానికి కూలిపోయే రోజులు దగ్గర పడ్డాయి
1 min read
పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ స్పష్ఠీకరణ
పత్తికొండ, న్యూస్ నేడు: ప్రజా కంటకంగా మారిన కోటను ప్రభుత్వం కూలిపోయే రోజులు దగ్గరపడ్డాయని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాట శ్రీదేవమ్మ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా బుధవారం పత్తికొండ పట్టణంలో వైఎస్ఆర్ సీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పేద ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తే ప్రభుత్వాలు పుట్టగతులు లేకుండా పోతాయని తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన 62,000 ప్రతులను జిల్లా కేంద్రానికి తీసుకువెళ్లే వాహనానికి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో కలిసి జెండా ఊపి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ సాగనంపారు. కోటి సంతకాల ప్రతులను మోటార్ సైకిల్ ర్యాలీతో పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు తీసుకువెళ్లారు. పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేవలం 5000 కోట్లు ఖర్చు పెడితే ప్రభుత్వమే మెడికల్ కాలేజీ లను దానికి అనుబంధంగా ఆసుపత్రులను నిర్వహించే వీలుపడుతుందని ఆమె తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా 17 మెడికల్ కాలేజీ లను వైసీపీ ప్రభుత్వంలో జగనన్న తీసుకువచ్చారని చెప్పారు. కోటి సంతకాల కార్యక్రమం పూర్తయిన తర్వాత గవర్నర్ ను కలిసి పేద ప్రజల అభిప్రాయాలను వివరిస్తామని ఆమె అన్నారు.

