NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేద విద్యార్థుల కోసం..ప్రైవేటీకరణ రద్దు చేయాలి

1 min read

జెండా ఊపి ప్రారంభించిన డాక్టర్ సుదీర్..

నందికొట్కూరు,  న్యూస్​ నేడు:  ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాల వినతి పత్రాల వాహనాన్ని నందికొట్కూరు పట్టణంలో పటేల్ సెంటర్ దగ్గర నందికొట్కూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జి డాక్టర్ దారా సుధీర్ జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుదీర్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో పేద మధ్యతరగతి వైద్య విద్య కోసం మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారని ఈ మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు చదువుకోవడం వల్ల వారి జీవితాలు ధన్యం అవుతాయని కాలేజీలను జగన్ తీసుకొస్తే ఈ ప్రభుత్వం వాటిని కొనసాగించకుండా ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని విద్యార్థుల కోసం ప్రైవేటీకరణను రద్దు చేయాలని రద్దు చేయని పక్షంలో వీటిపై సమ్మె ఉదృతం చేస్తామన్నారు.పార్టీ పిలుపు మేరకు ప్రైవేటీకరణ వద్దని కోరుతూ కోటి సంతకాల్లో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గం నుండి 17 వేల మంది సంతకాలు చేశారని ఈ పత్రాలను వాహనంలో నంద్యాల పార్టీ కార్యాలయానికి పంపినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మన్సూర్,జబ్బార్, పుల్యాల నాగిరెడ్డి,కౌన్సిలర్లు నాయబ్,కృష్ణ మరియు వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.

About Author