NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేడు మిడుతూరులో ఎమ్మెల్యే గ్రీవెన్స్..

1 min read

అర్జీలను స్వీకరించనున్న ఎమ్మెల్యే జయసూర్య..

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు : శుక్రవారం నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)ఉ 10:30 గంటల నుండి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రజల నుండి అర్జీలను స్వీకరించనున్నట్లు ఎంపీడీవో దశరథ రామయ్య తెలిపారు.మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే స్వయంగా ఎమ్మెల్యేకు అర్జీల రూపంలో ఇవ్వవచ్చని అన్నారు.అర్జీల స్వీకరణ అనంతరం మ 2.౩౦ నుండి అన్ని శాఖల మండల స్థాయి అధికారులు పంచాయతి కార్యదర్శులు, వీఆర్వోలు మరియు సచివాలయ సిబ్బందితో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి అధికారులు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీడీవో కోరారు.

About Author