NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వ్యాపార సముదాయాల కాంప్లెక్స్ ని సందర్శించిన ఏలూరు ఎమ్మెల్యే

1 min read

పలు సమస్యలకు పరిష్కారం మార్గం,సహజవుగా వ్యాపారులు చేసుకోండి

ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి 

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: నిర్ణీత గడువులోగా కేటాయించిన షాపుల్లో వ్యాపారులు తమ వ్యాపారాలను స్వచ్ఛందంగా ప్రారంభించకుంటే సంబంధిత షాపులను వేరేవారికి కేటాయించడం జరుగుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు 1టౌన్‌లోని చేపల మార్కెట్‌ వద్ద 2018 – 19 మధ్యకాలంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన షాపులు నిరుపయోగంగా ఉన్నాయనే విషయాన్ని పలువురు వ్యాపారుల ద్వారా తెలుసుకున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గురువారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రధానంగా కాలువ ఒడ్డున వ్యాపారాలు చేసుకునే వ్యాపారుల సౌకర్యార్థం ఇక్కడ నిర్మించిన సముదాయాల్లో 14 షాపుల్లో మాత్రమే వ్యాపారాలు కొనసాగుతూ ఉండడాన్ని గమనించిన ఎమ్మెల్యే చంటి మిగిలిన షాపుల్లో ఎందుకు వ్యాపారాలు సాగించడం లేదంటూ సంబంధిత షాపుదారుల్ని, అధికారుల్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 1టౌన్‌ ప్రాంతంలోని చేపల మార్కెట్‌ వద్ద షాపులు వందల సంఖ్యలో వెలిశాయన్నారు. గతంలో కాలువ ఒడ్డునున్న షాపులను తొలగించిన క్రమంలో అక్కడి వ్యాపారుల సౌకర్యార్థం అప్పట్లో నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌లో షాపులను కేటాయించారన్నారు. ఆయన వెంట ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, నగరపాలక సంస్థ కో – ఆప్షన్‌ సభ్యులు చోడే వెంకటరత్నం,ఎస్సెమ్మార్‌ పెదబాబు, డివిజన్‌ ఇన్‌ఛార్జ్‌ రాజామురళీ, క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌ మారం అను, చలువాది బాలకృష్ణ, ఆకుల కిషోర్‌,శిరిశీల రవికుమార్‌, వందవాశి సాయి భాస్కర్‌, విజయ ప్రకాష్‌, ఆర్‌ఐ గాంధీ, టిపివో సాయి తదితరులు పాల్గొన్నారు.

About Author