విద్యార్థులు కంటి సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, బాల సాయి కంటి ఆసుపత్రి, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్ పక్కన ఉన్న ఆనంద నిలయం మరియు ఎస్సీ బీసీ వసతి గృహం నందు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాష్ మాట్లాడుతూ కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయరాదని ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు కంటి సమస్యలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ ప్రతినిధి జిల్లా న్యాయ సేవాధికారికి సంస్థ లీగల్ సర్వీస్ యూనిట్ సభ్యులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ కంటి సమస్యలను తొలి దశలోనే గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స అందించేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గంగాధర్ రెడ్డి, డాక్టర్ బాల ఈశ్వరయ్య, ఎస్సీ హాస్టల్ వార్డెన్ సులోచన, బీసీ హాస్టల్ వార్డెన్ శైలజ, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు ఆనంద నిలయం వార్డెన్ రజిని, మురారి శంకరప్ప , లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ సభ్యులు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

