NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతి ఒక్కరి ఆరోగ్యమే ఆయుష్మాన్ భారత్

1 min read

ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన లక్ష్యం.

పత్తికొండ , న్యూస్​ నేడు:  సమాజంలో ప్రతి ఒక్కరిని ఆరోగ్యకరంగా ఉంచేందుకు ఆయుష్మాన్ భారత్- ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వ వైద్యులు కులశేఖర్, సత్యనారాయణరెడ్డి, ప్యానల్ లాయర్ సూరజ్ నబీలు తెలిపారు. శుక్రవారం కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జిల్లా న్యాయ సేవాదికార సంస్థ ఆదేశాల మేరకు, స్థానిక జూనియర్ సివిల్  కోర్టు జడ్జి జోష్నాదేవి సూచనల మేరకు ఆసుపత్రిలో రోగులకు ఆయుష్మాన్ భారత్ ఆవశ్యకత, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రయోజనాలపై న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందించే సేవలు, చిన్నారుల ఆరోగ్యం వైద్య సేవలపై శ్రద్ధ, టెలి మేడిసన్ ద్వారా అందే సేవలు, ఆరోగ్య సేవల పథకాలు ఎలా నమోదు చేసుకోవాలి తదితర విషయాలపై వైద్యులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మణిదీప్, నర్సింగ్ వైద్య విద్యార్థులు, లోకదాలత్ క్లర్క్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author