పేకాట రాయుళ్లు అరెస్ట్…
1 min read

పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ కి రాబందిన సమాచారం పై పెదవేగి ఎస్ఐ హరి గోపాల్ ఆకస్మిక దాడి
పేకాట స్థావరంపై దాడి చేసి 07 గురు అరెస్ట్
అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 32,000 నగదును నగదు స్వాధీనం చేసుకొన్న పెదవేగి ఎస్ఐ
ఏలూరు, న్యూస్ నేడు: జిల్లా ఎస్.కె. తాప్ ñ వి ప్రసాద్ ఆదేశాల మేరకు, అçసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించేందుకు చేపట్టిన చర్యల భాగంగా పెదవేగి సీఐ శ్రీ సిహెచ్. రాజశేఖర్ కి రాబడిన సమాచారం పై ఎస్ఐ హరి గోపాల్ వారి యొక్క సిబ్బంది తో కలిసి ప పెదవేగి మండలంలోని కూచిపూడి గ్రామములో పేకాట స్థావరంపై అకస్మాత్తుగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో 07 గురు వ్యక్తులు పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి మొత్తం రూ. 32,000 నగదును స్వాధీనం చేసుకొని సదరు సంఘటనపై పెదవేగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినారు.ఈ సందర్భంగా పెదవేగి ఎస్ఐ హరి గోపాల్ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు నివారణ కొరకు మారుమూల ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు, పేకాట కోడి పందాలు ప్రజల జీవితాలపై దుష్ఫలితాలు కలిగిస్తాయి అని, మద్యం అక్రమ రవాణా వంటి కార్యకలాపాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. ఎవరు ఈ తరహా చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడినా, వారిపై కఠిన చర్యలు తప్పవు. గ్రామీణ ప్రజలు తమ భవిష్యత్తును నాశనం చేసే ఇటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించే వారి యొక్క సమాచారాన్ని డయల్ 112 ఈ కు గాని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని సమాచారం అందించిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా పెదవేగి ఎస్ఐ తెలియ చేసినారు.

