NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉల్లాసంగా  ఉత్సాహంగా 2వ రోజు హేలాపురి బాలోత్సవం

1 min read

బాల బాలికల్లో జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించాలి

ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: విద్యార్థుల్లో కులాలు, మతాలు ప్రాంతాలకు అతీతంగా జాతీయ సమైక్యతా భావాన్ని బాలోత్సవాలు పెంపొందిస్తాయని ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ పిడియఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి అన్నారు.శనివారం స్థానిక  సిద్ధార్థ క్వెస్ట్ విద్యా సంస్థల ఆవరణలో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు ప్రాంగణంలో హేలాపురి బాలోత్సవం ఆవరణలో 2వ రోజు అత్యంత ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఉత్సాహంగా ఉల్లాసంగా కొనసాగింది. 2వ రోజు ప్రారంభ సభకు బాలోత్సవం ప్రధాన కార్యదర్శి దేవరకొండ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులను యంత్రాలుగా మర మనుసులుగా మార్చే విద్యా విధానం కొనసాగుతుందని చెప్పారు. విద్యార్థుల్లో సాంస్కృతిక జీవనం, సోదర భావం,సమానత్వం వంటి అంశాలను నేటి విద్యా వ్యవస్థ విస్మరించిందని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను కళా నైపుణ్యాలను, శాస్త్ర సాంకేతిక ఆలోచన విధానాన్ని పెంపొందించే విద్యా వ్యవస్థ ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు సెట్ వెల్ సీఈఓ కె.ఎస్ ప్రభాకర్, బాలోత్సవం అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు,అకడమిక్ అంశాల సమన్వయకర్త ఎస్.కె.ముస్తఫా అలీ, మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు, సిద్ధార్థ విద్యాసంస్థల అధినేత కోనేరు సురేష్ బాబు, ఎన్జీవో అసోసియేషన్ పూర్వ జిల్లా అధ్యక్షులు లాం విద్యాసాగర్, ఎయిర్ ఇండస్ట్రీస్ చైర్మన్ కె. కె.కుమార్ గుప్త,జి.ఎస్. ప్రసాద్,డాక్టర్ బి.సుబ్బారావు,కె.అబ్రహం,సూర్య గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ చామర్తి కృష్ణారావు,అప్పుస్మా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కడియాల విజయలక్ష్మి, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఆర్.రవికుమార్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మారుబోయిన కోటేశ్వరరావు అన్నే వెంకటేశ్వరరావు విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎ. రవి తదితరులు పాల్గొన్నారు.విద్యార్థుల నైపుణ్యాన్ని చాటిన బాలోత్సవం.రెండవ రోజు బాలోత్సవంలో మట్టితో బొమ్మలు తయారుచేయడం,పేపర్ క్రాఫ్ట్స్, కథలు చెప్పడం, మైక్రో ఆర్ట్, క్విజ్,జానపద నృత్యాలు,ఏకపత్రాభినయనాలు,లఘు  నాటికలు,చిత్ర సమీక్ష,బెస్ట్ ఫ్రం వేస్ట్,మ్యాజిక్ షో, మెమరీ టెస్ట్, పద్యం భావం వంటి అంశాలలో విద్యార్థులు ఉత్సాహపూరితంగా పాల్గొని ప్రదర్శనలు ఇచ్చారు. మూడవరోజు కూడా బాలోత్సవం కొనసాగనుంది.న్యాయ నిర్ణయేతలు విద్యార్థుల శక్తి సామర్ధ్యాలను గమనించి విజేతలను నిర్ణయ స్తున్నారు.

About Author