జూపాడుబంగ్లాలో ప్రారంభంకానున్న తి.తి.దే. ధార్మిక కార్యక్రమాలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధార్మిక వ్యాప్తిలో భాగంగా మంగళవారం నుండి శనివారం వరకు మండల కేంద్రమైన జూపాడు బంగ్లాలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం నుండి గురువారం వరకు మూడు రోజులు జి.వేంకటరమణయ్యచే సాయంత్రం 6-00 గంటల నుండి ధార్మిక ప్రవచనాలు, 7-00 గం. నుండి స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, శుక్రవారం ఉదయం 10-00 గం.నుండి సామూహిక గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను స్థానిక భక్త సమాజంచే ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ నిర్వాహకులు ఇల్లూరి లక్ష్మీనారాయణ శ్రేష్ఠి, ఆలయ ధర్మకర్త మాకా వేంకట సుబ్బయ్య, ధర్మ ప్రచార మండలి సభ్యులు అంబటి శివశంకర రెడ్డి, అర్చకులు ఉమ్మయ్య, చిన్నతిరుపాలు, గోవిందప్పస్వామి, బాబు, రాము, రామయ్య, కృష్ణమూర్తి, నాగశేషులు, మల్లిఖార్జున గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


