ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నానమ్మ దశదిన కార్యక్రమం
1 min read
హాజరైన అప్కాబ్ ఛైర్మన్ న్ని వీరాంజనేయులు
విచ్చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు,అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసిన ఏలూరు ఎంపీ పుట్టా
ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నాయనమ్మ పుట్టా పోలమ్మ ‘దశదిన కర్మ’ కార్యక్రమం సోమవారం ప్రొద్దుటూరులో నిర్వహించారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ స్వగృహంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు హాజరై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను, ఆయన తండ్రి సుధాకర్ యాదవ్ ను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంపీ నాయనమ్మ పుట్టా పోలమ్మ జూలై 10న మృతి చెందిన విషయం తెలిసి గత వారం రోజులుగా ఏలూరు పార్లమెంట్ కు చెందిన అనేకమంది నేతలు ఎంపీ ను హైదరాబాద్ నివాసంలో కలిసి పరామర్శించారు. కాగా, సోమవారం ప్రొద్దుటూరులో జరిపిన దశదిన కర్మకు అప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు సహా, ఏలూరు పార్లమెంట్ కు చెందిన పలువురు నేతలు హాజరై పోలమ్మ చిత్రపటం వద్ద నివాళి అర్పించి, సంతాపం తెలిపారు. తనను పరామర్శించడానికి వచ్చిన నేతలు, పార్టీ కార్యకర్తలందరినీ పేరు పేరునా పలకరించిన ఎంపీ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.


